తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలుగు వెలగాలి.. - UNIVERCITY

తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో "తెలంగాణ సాహిత్యం, చేతి వృత్తులు-సాంస్కృతిక అధ్యయనం" పై సాహితీ వేత్తలు ప్రసంగించారు. మన మాతృభాష తెలుగును ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్​ నందిని సిధారెడ్డి అన్నారు.

మాతృభాషను మరవొద్దు

By

Published : Mar 5, 2019, 9:09 PM IST

మాతృభాషను మరవొద్దు
నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో "తెలంగాణ సాహిత్యం, చేతి వృత్తులు-సాంస్కృతిక అధ్యయనం" అంశంపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. తెలుగు అధ్యయన శాఖ, ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని వీసీ సాంబయ్య, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్​ నందిని సిధారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రభుత్వ పాలన పూర్తిగా తెలుగులో జరిగే విధంగా చూడాలని సిధారెడ్డిఅన్నారు.కళాకారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహూతులను అలరించారు.

ABOUT THE AUTHOR

...view details