తెలంగాణ

telangana

ETV Bharat / state

తందూరి చాయ్​... రుచితో పాటు ఆరోగ్యం - ఆర్మూర్​లో తందూరి కుండా చాయ్​

పని ఒత్తిడి ఎక్కువైనా... సాయంత్రం స్నేహితులతో కబుర్లు చెబుతున్నా... ఓ కప్పు టీ కడుపులో పడితే కలిగే ఆనందమే వేరు. రోడ్డుపైకి వెళ్తే... ఎన్నో రకాల చాయ్​లు దొరుకుతాయ్​. కానీ నిజామాబాద్​లో ఓ వ్యక్తి రుచితో పాటు ఆరోగ్యకరమైన చాయ్​ని అందిస్తున్నారు.

special-pot-tea-at-nizamabad-district
తందూరి చాయ్​... రుచితో పాటు ఆరోగ్యం

By

Published : Mar 12, 2020, 6:53 PM IST

తందూరి చాయ్​... రుచితో పాటు ఆరోగ్యం

తందూరి బట్టిలో బొగ్గుల మీద మట్టికుండలో మరగించిన చాయ్​... చిన్న కుండల్లో పోసుకుని తాగుతుంటే ఆ మజాయే వేరు. నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​లో తందూరి కుండా చాయ్​... తేనేటి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. హౌసింగ్​ బోర్డ్​ కాలనీకి చెందిన చెలిమేళ శేఖర్​...​ నిజాం సాగర్​ వంతెన సమీపంలో నెలరోజుల కిందట హోటల్​ను ఏర్పాటు చేశారు. ఇత్తడి పాత్రల్లో పాలు, నీళ్లు, చక్కెర వేసి మరగిస్తారు. ఈలోపు తందూరి బట్టిలో మండుతున్న బొగ్గులపై మట్టి కుండలను వేడి చేస్తారు. ఇత్తడి పాత్రల్లో ఉన్న మిశ్రమాన్ని అందులో పోస్తారు. కొద్దిసేపు మరగనిస్తారు. ఆ తర్వాత చిన్న చిన్న మట్టి కుండల్లో చాయ్​ని పోసి ఇస్తున్నారు.

ఈ కుండ చాయ్​ని తాగేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని శేఖర్​ చెబుతున్నాడు. ప్లాస్టిక్​ గ్లాసుల్లో తాగితే ఆరోగ్యానికి హానికరమని... ఈ కుండల్లో చాయ్​ ఆరోగ్యంతో పాటు రుచికరంగా ఉందని తేనీటి ప్రియుుల అంటున్నారు. కుండ చాయ్ రుచిగా ఉండటంతో స్థానికులు ఎగబడుతున్నారు. తుందూరీ టీని ఆస్వాదిస్తున్నారు.

ఇదీ చదవండిఃకరోనా నుంచి కాపాడుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details