పోచారానికి మాతృవియోగం - spekaer
సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి మాతృవియోగం. సంతాపం తెలిపిన ముఖ్యమంత్రి. ఇవాళ మధ్యాహ్నం బాన్సువాడ మండలం పోచారంలో అంత్యక్రియలు.
పోచారంకు మాతృవియోగం
రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తల్లి మృతి చెందారు. ఆమెకు 107 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పరిగే పాపవ్వ మంగళవారం రాత్రి 11.30 గంటలకు స్వర్గస్థురాలయ్యారు. తల్లి మరణ వార్త తెలియగానే పోచారం శ్రీనివాస రెడ్డి బాన్సువాడ చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం బాన్సువాడ మండలం పోచారంలో అంత్యక్రియలు జరగనున్నాయి. స్పీకర్ తల్లి మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఫోన్లో శ్రీనివాస్‌రెడ్డితో మాట్లాడి పరామర్శించారు.
Last Updated : Feb 6, 2019, 9:44 AM IST