తెలంగాణ

telangana

ETV Bharat / state

సంపాదనంతా కూతుళ్లకే ఇస్తున్నాడని తండ్రిని చంపేశాడు! - సంపాదనంతా కూతుళ్లకే ఇస్తున్నాడని తండ్రిని చంపేశాడు!

తండ్రీకొడుకుల మధ్య జరిగిన కుటుంబ వివాదం హత్యకు దారితీసింది. కత్తితో ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా... కొడుకు చేతిలో తండ్రి హతమయ్యాడు. ఈ ఘటనలో నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లిలో జరిగింది.

son murdered his father in dichpally
సంపాదనంతా కూతుళ్లకే ఇస్తున్నాడని తండ్రిని చంపేశాడు!

By

Published : May 27, 2020, 10:45 AM IST

నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లిలో దారుణం జరిగింది. తండ్రీకొడుకుల మధ్య జరిగిన ఓ కుటుంబ వివాదం.... హత్యకు దారితీసింది. ఖిల్లా డిచ్​పల్లికి చెందిన వాయిద్‌ఖాన్(78)‌ ఇంటి వద్ద చికెన్‌, సైకిల్‌ మరమ్మతుల దుకాణాలు నిర్వహించేవాడు. అతనికి కొడుకుతోపాటు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కొడుకు అప్సర్‌ఖాన్‌ హమాలీ పని చేస్తూ జీవనం వెళ్లదీస్తున్నాడు.

తండ్రి సంపాదించిన డబ్బు మొత్తం కూతుళ్లకే ఇస్తున్నాడని తరచూ గొడవపడేవారు. రంజాన్‌ పండగరోజూ తగాదా పడ్డారు. మంగళవారం రోజు దుకాణంలో ఉన్న తండ్రి వద్దకు వచ్చిన అప్సర్‌ఖాన్‌ మళ్లీ గొడవపడ్డారు. ఇద్దరూ ఆగ్రహంతో ఊగిపోతూ ఘర్షణకు దిగారు. వాయిద్‌ఖాన్‌ కొమ్మలు నరికే కత్తితో దాడి చేయడంతో అప్సర్‌ఖాన్‌ ముక్కు తెగింది. కోపోద్రిక్తుడైన అతను ఆదే కత్తి తీసుకొని తండ్రిని నాలుగుసార్లు పొడిచి హత్య చేశారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని మృతదేహన్ని శవపరీక్ష నిమిత్తం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చూడండి:కరోనా వేళ కూలీల ఆశాదీపం 'ఉపాధిహామీ'

For All Latest Updates

TAGGED:

crime news

ABOUT THE AUTHOR

...view details