నిజామాబాద్ జిల్లాలో సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ సుడిగాలి పర్యటన చేశారు. మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 20, 21, 21A పనులను పరిశీలించారు. నవీపేట్ మండలం బినోల వద్ద టన్నెల్ పనులను, గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఏరియల్ సర్వే నిర్వహించారు.
కాళేశ్వరం పనులను పరిశీలించిన స్మితా సబర్వాల్ - smitha sabarval in Kaleswaram tour in nizamabad district
నిజామాబాద్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్న ప్యాకేజీ 20, 21, 21A పనులను మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కాళేశ్వరం పనులను పరిశీలించిన సీఎంవో
నిజామాబాద్ శివారులోని సారంగపూర్ వద్ద పంప్ హౌస్, టన్నెల్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మోపాల్ మండలం మంచిప్ప చెరువును సందర్శించారు. ఆ తర్వాత డిచ్పల్లి మండలం మెంట్రాజ్ పల్లి వద్ద పంపు హౌస్, గ్రావిటీ కెనాల్ పనులను పరిశీలించారు.
ఇదీ చూడండి: భార్య ఫిర్యాదు.. ట్రైనీ ఐపీఎస్ సస్పెండ్