'కేసీఆర్ తాత ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించి బడులు తెరిపించండి' అంటూ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చిన్నారులు ధర్నా చేపట్టారు. పొడిగించిన దసరా 'సెలవులను రద్దు చేసి వెంటనే మా బడులను తెరిపించండి కేసీఆర్ తాత' అంటూ నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు చదువులు ఆపాల తాత అని విద్యార్థులు కేసీఆర్‌ను ప్రశ్నించారు.
'కేసీఆర్ తాత.. బడి తెరవండి.. ప్లీజ్' - kcr news
నిజామాబాద్‌లో చిన్నారులు వినూత్న పద్దతిలో నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్ తాత బడికి పోతాం.. బంద్‌లు ఆపండి అంటూ విద్యార్థులు ధర్నా చేపట్టారు.

small kids protest for reopen schools at nizamabad