నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద భారీగా పోటెత్తుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగుల వద్దకు నీరు చేరింది. 16 గేట్ల ద్వారా నీటిపారుదల శాఖ అధికారులు 50వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
శ్రీరాంసాగర్కు పోటెత్తిన వరద.. 16 గేట్లు ఎత్తివేత - srsp in nizamabad district
రెండ్రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ వరద చేరుతోంది. నీటిపారుదల శాఖ అధికారులు 16 గేట్లు ఎత్తి.. 50వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
శ్రీరాంసాగర్కు పోటెత్తిన వరద
ప్రాజెక్టులోకి 63వేల 103 క్యూసెక్కుల నీరు చేరుతోందని అధికారులు తెలిపారు. వర్షాల వల్ల వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశముందని వెల్లడించారు.
- ఇదీ చదవండి :ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ