Six People Won MLAs For The First Time in Nizamabad : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 6 నియోజకవర్గాల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఆరుగురు విజయం సాధించారు. నిజామాబాద్ అర్బన్‌లో వ్యాపారవేత్త ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా(Surya Narayana Gupta) ఎమ్మెల్యేగా గెలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తన సామాజిక వర్గానికే చెందిన గణేష్‌గుప్తాపై విజయం సాధించారు. నిజామాబాద్‌కు చెందిన ధన్పాల్ సూర్యనారాయణ విశ్వ హిందూ పరిషత్‌లో సభ్యుడిగా చేరి అధ్యక్షుడిగా ఎదిగారు. వ్యాపారవేత్తగా ఉమ్మడి జిల్లా ప్రజలకు సుపరిచితులు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీజేపీలో చేరి 2014లో నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో అవకాశం రాలేదు. 2023లో మళ్లీ బీజేపీ నుంచే పోటీ చేసి గెలుపొంది తొలిసారి అసెంబ్లీకి వెళ్తున్నారు.
తెలంగాణలో కొత్త సర్కార్ - ప్రభుత్వ అధికారుల పోస్టింగులపై చర్చ - డీజీపీ నుంచి సీఐ వరకు బదిలీలు!
Bhupathi Reddy Wins Nizamabad Rural Constituency : నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గం(Nizamabad Rural Constituency) నుంచి రేకులపల్లి భూపతిరెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నిజామాబాద్ గ్రామీణ మండలం జలాల్‌పూర్‌కు చెందిన వైద్యుడు భూపతిరెడ్డి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత, అప్పటి తెరాస(బీఆర్ఎస్) నుంచి భూపతిరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. పలు కారణాలతో భూపతిరెడ్డి టీఆర్ఎస్(బీఆర్ఎస్)కు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్‌పై విజయం సాధించి, తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆర్మూర్ నుంచి బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్‌రెడ్డి తొలిసారే ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయ అనుభవం లేకుండానే, పోటీ చేసిన మొదటి సారే నేరుగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పైడి రాకేష్‌రెడ్డి స్వగ్రామం ఆర్మూర్ మండలం అంకాపూర్. వ్యాపారవేత్త అయిన రాకేష్‌రెడ్డికి బీజేపీ టికెట్ కేటాయించింది. ఎన్నికలకు 3 నెలల ముందు నియోజకవర్గానికి వచ్చిన రాకేష్‌రెడ్డి, ఎలాంటి అంచనాలు లేకుండానే పోటీకి దిగి సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై అనూహ్య విజయం సాధించారు.
Katipally Venkata Ramana Reddy Wins Kamareddy : కామారెడ్డి నుంచి సంచలన విజయం నమోదు చేశారు కాటిపల్లి వెంకటరమణారెడ్డి. సీఎం, కాబోయే సీఎంలను కలిపి ఓడించి చరిత్ర సృష్టించారు. తొలిసారే ఎమ్మెల్యేగా విజయం సాధించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డిది రాజకీయ కుటుంబం. రమణారెడ్డి తండ్రి రాజారెడ్డి సమితి అధ్యక్షుడిగా పని చేశారు. తండ్రి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన రమణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పని చేశారు.