నిజామాబాద్ నగరంలో దాదాపు నెలన్నర తర్వాత దుకాణాలు తెరుచుకున్నాయి. సరి, బేసి విధానంలో దుకాణాలు తెరుచుకోవడానికి నగర పాలక సంస్థ అనుమతించింది. మిగిలిన ఎలక్ట్రికల్, హార్డ్వేర్, బట్టలు, రిపేరింగ్, ఇతర దుకాణాలు ఈ రోజు తెరుచుకున్నాయి. 50 శాతం మాత్రమే షాపులు తెరవాలని ప్రభుత్వం ఆదేశించడం వల్ల దుకాణ నంబర్ ఆధారంగా తెరిచేందుకు అనుమతిస్తున్నారు.
నిజామాబాద్లో తెరుచుకున్న దుకాణాలు - Nizamabad Municipal Corporation Latest News
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ నిబంధనలను సడలించడం వల్ల నిజామాబాద్లో దుకాణాలు తెరుచుకున్నాయి. సరి, బేసి విధానంలో దుకాణాలను తెరిచేందుకు నగర పాలక సంస్థ అనుమతులిచ్చింది. రోడ్లపై వాహనాల రద్దీ పెరిగింది.
![నిజామాబాద్లో తెరుచుకున్న దుకాణాలు నిజామాబాద్లో తెరుచుకున్న దుకాణాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7097776-625-7097776-1588843823500.jpg)
నిజామాబాద్లో తెరుచుకున్న దుకాణాలు
దుకాణం బేసి సంఖ్య ఉంటే... బేసి తేదీన తెరవాలని నగర పాలక సంస్థ కమిషనర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొన్నటి వరకు జనం లేక రోడ్లన్నీ బోసిపోగా.. ఈరోజు రహదారులపై జనసందోహం కనిపించింది.