తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి పాక శ్రీకాంత్‌ది ప్రభుత్వ ప్రేరేపిత హత్యే అని భారత విద్యార్థి సమాఖ్య(ఎస్ఎఫ్ఐ) ఆరోపించింది. నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్లనే ఆత్మహత్యలు జరుగుతున్నాయని మండిపడ్డారు. శ్రీకాంత్ హత్యను ప్రేరేపిత హత్యగా భావించి సీఎం కేసీఆర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్ రెడ్డిలపై సుమోటోగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
'పాక శ్రీకాంత్‌ది ప్రభుత్వ ప్రేరేపిత హత్యే..' - telangana news
నిరుద్యోగ యువత ఆత్మహత్యలపై భారత విద్యార్థి సమాఖ్య ఆందోళన చేపట్టింది. పోరాడి సాధించి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. నిజాబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నాయకులు నిరసన చేపట్టారు.
నిజామాబాద్‌లో ఎస్ఎఫ్ఐ ధర్నా
మరణించిన శ్రీకాంత్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని.. లేనిపక్షంలో ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు వేణుగోపాల్, జిల్లా కమిటీ సభ్యులు సతీష్, నాయకులు సాయి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:సుప్రీంకోర్టు నిర్ణయించే వరకు ఎల్‌ఆర్‌ఎస్ అమలు చేయొద్దు: హైకోర్టు