నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల పరిశీలకుడు, సీనియర్ ఐఏఎస్, కో- ఆపరేటివ్ శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ వీరబ్రహ్మయ్య పరిశీలించారు. మంగళవారం కలెక్టర్ సి.నారాయణ రెడ్డితో కలిసి పాలిటెక్నిక్ కళాశాల, జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాల్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు.
పాలిటెక్నిక్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో టెంటు, డయాస్, పబ్లిక్ అడ్రస్ సిస్టం ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. కామారెడ్డి, నిజామాబాద్ కు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇక్కడి నుంచేనని, పాలిటెక్నిక్ కళాశాలలో వచ్చే సోమవారం వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఆర్డీఓను ఆదేశించారు.