కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు నిజామాబాద్ జిల్లా ధర్పల్లి పంచాయతీ పాలకవర్గం స్వచ్ఛందంగా మూడ్రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించింది. మండలకేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పాలకవర్గం సభ్యులు తెలిపారు. మూడ్రోజుల పాటు వ్యాపార సముదాయాలు మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.
ధర్పల్లిలో మూడు రోజుల పాటు లాక్డౌన్ - self lock down in dharpalli in nizamabad
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలకేంద్రంలో కరోనా పాజిటివ్ కేసు నమోదవ్వడం వల్ల అప్రమత్తమైన పంచాయతీ పాలకవర్గం మూడ్రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించింది.
ధర్పల్లిలో మూడ్రోజులపాటు లాక్డౌన్
కరోనా నిబంధనలు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని, లేనియెడల పెద్దమొత్తంలో జరిమానాలు విధిస్తామని సీఐ ప్రసాద్ స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.