తెలంగాణ

telangana

ETV Bharat / state

అటవీ శాఖ అధికారులు వేధింపులను ఆపాలని ఆందోళన - nizamabad district news

అటవీ శాఖ అధికారులు తమను వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఎస్సీ కుటుంబాలు నిజామాబాద్​ కలెక్టరేట్​ను ఆశ్రయించాయి. తమకు చెందిన భూమిని అధికారులు అటవీ పరిధిలోకి వస్తుందని వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు.

sc families demanded to Stop the harassment of forest department officials in nizamabad district
అటవీ శాఖ అధికారుల వేధింపులను ఆపాలి: ఎస్సీ కుటుంబాలు

By

Published : Jul 16, 2020, 10:54 PM IST

ఫారెస్ట్ అధికారులు వేధింపులు ఆపాలని జానకంపేటకు చెందిన పలు ఎస్సీ కుటుంబాలు బాబూ జగ్జీవన్ రామ్ మాదిగ దండోరా సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చాయి. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్​లో 1977లో అప్పటి ప్రభుత్వం 18 ఎస్సీ కుటుంబాలకు, ఒక్కొక్కరికి 16 గుంటల చొప్పున ఇచ్చిందని... అ భూమిలో వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నామని వారు తెలిపారు.

కానీ ఇటీవల అటవీ శాఖ అధికారులు భూములు, తమ పరిధిలోకి వస్తాయంటూ వేధింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కావున అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడు భూములు ఫారెస్ట్ అధికారులు తీసుకుంటే తమ బతుకులు అగమ్యగోచరంగా మారుతాయని, ఉన్నతాధికారులు అధికారులు చొరవ తీసుకొని న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

ఇవీ చూడండి: ప్రతిపక్షాలవి దిగజారుడు రాజకీయాలు: శ్రీనివాస్​ గౌడ్​

ABOUT THE AUTHOR

...view details