తెలంగాణ

telangana

ETV Bharat / state

'టెండర్​ను రద్దు చేసి ప్రభుత్వమే ఉపాధి కల్పించాలి'

నిజామాబాద్​ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్​ కళాశాల, ఆస్పత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. కనీస వేతనంతో పాటు, పీఎఫ్​ బకాయిలు చెల్లించాలని పేర్కొన్నారు.

sanitation staff dharna at nizamabad hospital
నిజామాబాద్​ ఆస్పత్రి ఎదుట ధర్నా

By

Published : Mar 18, 2021, 5:21 PM IST

కాలపరిమితి ముగిసిన టెండర్​ను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా పనులు కల్పించాలని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు. మెడికల్ కళాశాల, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, బోధన్ ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల కాలపరిమితి ముగిసినందున ప్రభుత్వమే టెండర్​ను రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య కోరారు. వారికి ప్రభుత్వమే నేరుగా పనులు కల్పించాలని డిమాండ్​ చేశారు.

పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం రూ. 21 వేలు, సంవత్సరానికి రెండు జతల యూనిఫామ్​, వేతనంతో కూడిన సెలవు, పీఎఫ్​ బకాయిలను చెల్లించాలని సిబ్బంది డిమాండ్​ చేశారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో కార్మికుల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:'అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యం'

ABOUT THE AUTHOR

...view details