తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇందూరులో భారీగా ఇసుక దందా.. పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

నిజామాబాద్​ జిల్లాలో రోజురోజుకు ఇసుక దందా పెరిగిపోతోంది. అక్రమార్కులు దాచిన ఇసుక నిల్వలను వెలుగులోకి తీసుకొచ్చినా.. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించగా ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఈ ఇసుక దందాలో అధికారులకు ముడుపులు అందుతున్నాయని.. టాస్క్​ఫోర్స్​ అధికారులు వెంటనే స్పందించి విస్తృతంగా దాడులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

nizamabad people asking for justice in sand theft issue
ఇందూరులో భారీగా ఇసుక దందా.. పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

By

Published : Aug 22, 2020, 3:32 PM IST

నిజామాబాద్​ జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో వారం రోజుల క్రితం దాచిన ఇసుక నిల్వలను 'ఈనాడు' వెలుగులోకి తీసుకువచ్చినా.. అధికారులు మిన్నకున్నారు. ఈ నేపథ్యంలో అక్రమార్కులు రెచ్చిపోయి జేసీబీలతో యథేచ్ఛగా ఇసుక తవ్వుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు.

శుక్రవారం రాత్రి లింగాపూర్ వాగులోకి వెళ్లకుండా రెవెన్యూ అధికారులు తవ్విన కందకాలు పూడ్చి వేసి ఇసుకను తవ్వి వ్యవసాయ క్షేత్రంలో నిల్వ చేశారు. నెల రోజులుగా కొందరు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు స్థానికులు ఈటీవీ భారత్ దృష్టికి తీసుకువచ్చారు. ఇసుక తవ్వకం పూర్తయిన వెంటనే యధావిధిగా కందకాలు తవ్వి వెళ్లిపోయారు.

తెలంగాణ ప్రభుత్వం ఇసుక రవాణాపై కఠిన నియమాలను అమలు చేస్తుండటం వల్ల ఇసుకకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇది అక్రమార్కులకు వరంలా మారింది. ఒక్కో ట్రాక్టర్ రూ.6వేల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇందులో అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖలకు ముడుపులు అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేకే తండా, ఎల్లారెడ్డి పల్లి గ్రామాలకు చెందిన కొందరు దీన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. ఇటీవలే ఎన్నికైన ఓ ప్రజా ప్రతినిధి స్వయంగా ఈ దందా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా టాస్​ఫోర్స్​ అధికారులు విస్తృతంగా దాడులు చేసి అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవాలని, భూగర్భ జలాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి :శ్రీశైలం అగ్నిప్రమాదం ఘటనలో తొమ్మిది మంది మృతి

ABOUT THE AUTHOR

...view details