తెలంగాణ

telangana

ETV Bharat / state

పసుపు రైతుల కడుపుమంట... - GOVERNMENT

ఎర్రజొన్న, పసుపు మద్దతు ధర కోసం పోరాటాలు ఊపందుకుంటున్నాయి. వివిధ జిల్లాల్లో రైతులు రోడ్డెక్కి ధర్నాలు, రస్తారోకోలు నిర్వహిస్తున్నారు. పంటకు 15 వేల మద్దతు ధర కల్పించాలని నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​, జగిత్యాల జిల్లాలోని వివిధ మండలాల రైతులు ఆందోళన బాటపట్టారు.

వంటా వార్పు కార్యక్రమం

By

Published : Feb 26, 2019, 10:25 AM IST

Updated : Feb 26, 2019, 10:46 AM IST

పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర ప్రకటించాలని రైతుల ఆందోళన

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్​లో మరో సారి రైతులు రోడ్డెక్కారు. మామిడిపల్లి చౌరస్తాలో పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర ప్రకటించాలని పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆర్మూర్ సహా 13 మండలాల్లో 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ రైతులు మాత్రం వెనక్కి తగ్గలేదు. రేపు ఆర్మూర్‌ నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేపడుతామని రైతు సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఆర్మూర్ నుంచి హైదరాబాద్​కు ప్రతి గ్రామం నుంచి 20 మంది చొప్పున పాదయాత్రగా వెళ్లాలని నిర్ణయించారు. ఆర్మూర్​లో రైతులు ఆందోళన విరమించారు.
జగిత్యాల జిల్లాలోని వివిధ మండలాల నుంచి తరలి వచ్చిన రైతులు... జగిత్యాల, కరీంనగర్ రహదారి థరూర్ వంతెనపై ఆందోళనకు దిగారు. మూడు గంటల పాటు ఎండలోనే ధర్నా చేశారు. ఇరువైపులా 4 కిలో మీటర్ల మేర రాకపోకలు స్తంభించాయి. రోడ్డుపై వంట వార్పు నిర్వహించారు. పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. తమకు ప్రభుత్వం నుంచి హామీ వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదంటూ రోడ్డుపైనే బైఠాయించారు.

Last Updated : Feb 26, 2019, 10:46 AM IST

ABOUT THE AUTHOR

...view details