తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు - Nizamabad district latest news

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. రంగురంగుల బతుకమ్మలను ఒకచోట చేర్చి.. మహిళలంతా కలిసి ఆడిపాడారు. అనంతరం సమీపంలోని చెరువులో నిమజ్జనం చేశారు.

Saddula Bathukamma celebrations in Nizamabad
నిజామాబాద్​లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

By

Published : Oct 20, 2020, 10:48 PM IST

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ముబారక్​ నగర్​లో సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. రంగురంగుల బతుకమ్మలతో వీధులన్నీ కళకళలాడాయి. మహిళలంతా ఒకే చోట చేరి బతుకమ్మ పాటలతో ఆడి పాడారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఉత్సాహంగా గడిపారు.

బతుకమ్మ పాటలతో పట్టణంలోని వీధులన్నీ మారుమోగాయి. వేడుకల అనంతరం మహిళలంతా కలిసి బతుకమ్మలను సమీపంలోని చెరువులో నిమజ్జనం చేశారు.

ఇదీ చూడండి.. హైదరాబాద్​లో కొనసాగుతోన్న వరుణుడి ప్రతాపం

ABOUT THE AUTHOR

...view details