ప్రైవేటు విద్యాసంస్థలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వివరాలను ఈనెల 15వ తేదీలోగా అందించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలెక్టర్లకు, డీఈవోలకు ఆదేశించారు. నిజామాబాద్ జిల్లాలో గుర్తింపు పొందిన పాఠశాలలు 450 బోధన, బోధనేతర సిబ్బంది 6,204, వీరి ఆధార్, బ్యాంక్ ఖాతా, ఇతర వివరాలను వెంటనే సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు.
'ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే వారి వివరాలు ఇవ్వండి' - telangana news
ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి రూ.2000, 25 కేజీల బియ్యం అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వారి వివరాలు సేకరించి ఈనెల 15వ తేదీలోగా అందించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలెక్టర్లకు, డీఈవోలకు ఆదేశించారు.
'ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే వారి వివరాలు ఇవ్వండి'
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం ప్రకారం ఒక్కరికి రూ.2000, 25 కేజీల బియ్యం అందించడానికి సీరియల్ తీసుకోవాలన్నారు. ఈనెల 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఎంఈఓల ద్వారా డేటా సేకరించాలని, ఏప్రిల్ 28వ తేది వరకు ఆన్లైన్లో నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు. దీనికి సంబంధించి విధి విధానాలను, కార్యాచరణ ప్రణాళిక అమలు కోసం ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే లక్ష కరోనా పరీక్షలు: డీహెచ్