నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగల్ పహాడ్‌కు చెందిన ఆర్టీసీ కార్మికుడు రాజేందర్ గుండెపోటుతో మృతి చెందాడు. బోధన్ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజేందర్ ఇవాళ ఉదయం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచాడు. 52 రోజులుగా సమ్మెలో పాల్గొని... ఇవాళ విధుల్లో చేరేందుకు సన్నద్ధంగా ఉన్నాడని... ప్రభుత్వ నిర్ణయంతో కలత చెంది ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని కుటుంబ సభ్యులు విలపించారు.
గుండెపోటుతో ఆర్టీసీ కార్మికుడు మృతి - ts rtc strike 2019
ఎడపల్లి మండలం మంగల్ పహాడ్‌కు చెందిన ఆర్టీసీ కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి అనుమతించడం లేదన్న ప్రభుత్వ నిర్ణయంతో కలత చెంది మృత్యవాతపడ్డాడని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు.
గుండెపోటుతో ఆర్టీసీ కార్మికుడు మృతి
హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. తోటి కార్మికుడి మృతిపట్ల ఆర్టీసీ కార్మికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరింత మంది ప్రాణాలు కోల్పోకముందే తమను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: 'ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే... యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తాం'