నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ సమ్మెకు మద్దతు పెరుగుతోంది. బోధన్‌లో కార్మికుల సమ్మెకు సంఘీభావంగా జర్నలిస్టు, విశ్రాంత ఉపాధ్యాయుల సంఘం, రాజకీయ పార్టీలు బైక్ ర్యాలీ నిర్వహించాయి. అంబేడ్కర్ చౌరస్తా నుంచి ర్యాలీ పోస్ట్ ఆఫీస్, శక్కర్ నగర్, రాకాసిపేట్ మీదుగా కొనసాగింది. ప్రభుత్వం వెంటనే కార్మికులతో చర్చలు జరపాలని సభ్యులంతా డిమాండ్ చేశారు.
ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా పలు సంఘాల బైక్ ర్యాలీ
ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిజామాబాద్ జిల్లా బోధన్‌లో జర్నలిస్టు, విశ్రాంత ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీలు బైక్ ర్యాలీ నిర్వహించాయి. ప్రభుత్వం వెంటనే కార్మికులతో చర్చలు జరపాలని సభ్యులు డిమాండ్ చేశారు.
బైక్ ర్యాలీ