ఇందూరు జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ఉమ్మడి నిజామాబాద్ రీజినల్ పరిధిలో 6 డిపోలు ఉండగా,అందులో 650 బస్సులు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని డిపో- 1 నుంచి 32, డిపో- 2, 28 బస్సులను వివిధ రూట్లలోకి పంపించినట్లు ఆర్ఎం సోలమన్ తెలిపారు. ప్రయాణికుల సంఖ్యను బట్టి మరికొన్ని బస్సులను పెంచే అవకాశం ఉందన్నారు.
నిజామాబాద్ జిల్లాలో రోడ్డెక్కిన ప్రజా రవాణా
నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. లాక్డౌన్ నిబంధనల మేరకు అధికారులు... డిపోలోనే బస్సులను శానిటైజ్ చేసి పంపిస్తున్నారు. మాస్కు ధరించని ప్రయాణికులను బస్సులోకి అనుమతించడం లేదు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగులకు శానిటైజర్లను పంపిణీ చేసినట్లు సోలమన్ తెలిపారు. బస్సులో ప్రయాణికులను పరిమిత సంఖ్యలో ఎక్కించాలని ఉద్యోగులకు సూచించారు. నిలబడి ప్రయాణిచేందకు అనుమతులు లేవని పేర్కొన్నారు. జిల్లా నుండి అన్ని జిల్లాలకు బస్సులను పంపడం జరుగుతుందని... రెడ్‌జోన్ ప్రాంతాలకు మాత్రం మినహాయింపు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే ఇతర రాష్ట్రాలకు బస్సులను నడపం లేదని తెలిపారు. కర్ఫ్యూ అమలులో ఉన్నందున బస్సులను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నడపడం జరుగుతుందని... ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తుంచాలని ఆర్ఎం సూచించారు.