తెలంగాణ

telangana

ETV Bharat / state

దుస్తులు విప్పేసి ఆర్టీసీ డ్రైవర్‌ నిరసన.. ఎందుకో తెలుసా? - ts news

ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారని దుస్తులు విప్పేసి ఆర్టీసీ డ్రైవర్‌ నిరసన తెలిపిన సంఘటన నిజామాబాద్​లో జరిగింది. తరచూ డీఎం కౌన్సెలింగ్​ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని ఆ డ్రైవర్​ ఆవేదన వ్యక్తం చేశారు.

దుస్తులు విప్పేసి ఆర్టీసీ డ్రైవర్‌ నిరసన.. ఎందుకో తెలుసా?
దుస్తులు విప్పేసి ఆర్టీసీ డ్రైవర్‌ నిరసన.. ఎందుకో తెలుసా?

By

Published : May 8, 2022, 8:00 PM IST

నిజామాబాద్‌ ఆర్టీసీ డిపో-2లో పనిచేస్తున్న డ్రైవర్‌ గణేశ్‌.. శనివారం డీఎం కార్యాలయం వద్ద తన దుస్తులు విప్పేసి నిరసన వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. ఆయన 15 ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల కేఎంపీఎల్‌ (మైలేజి) తక్కువ వచ్చిందని ఆయనకు డీఎం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. వారం గడవక ముందే మళ్లీ డీఐ పిలిచి.. కేఎంపీఎల్‌ తగ్గిందంటూ డీఎంను కలవాలని చెప్పారు. దీంతో గణేశ్‌ ఆవేదనకు గురై.. తరచూ ఇలా కౌన్సెలింగ్‌ పేరుతో ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.

దుస్తులు విప్పేసి ఆర్టీసీ డ్రైవర్‌ నిరసన.. ఎందుకో తెలుసా?

పాత బస్సులతో కేఎంపీఎల్‌ ఎలా తీసుకురావాలని ప్రశ్నిస్తూ తన దుస్తులు విప్పేసి బయటికొచ్చేశారు. తోటి సిబ్బంది ఆయనను అడ్డుకుని సముదాయించారు. దీనిపై డీఎం వెంకటేశంను ఈటీవీ భారత్​’ వివరణ కోరగా.. కౌన్సెలింగ్‌కు హాజరు కావాలనే బాధతోనే గణేశ్‌ ఇలా చేశారన్నారు. సంస్థను కాపాడేందుకు అందరం కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details