RTC Conductor Ticket Issue at Nizamabad : నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్లే ఆర్టీసీ బస్సులో ఓ మహిళకు కండక్టర్ టికెట్‌కు ఛార్జీ వేయడం వివాదాస్పదమైంది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆర్టీసీ కండక్టర్ వ్యవహరిస్తున్నారని ఓ మహిళ ఆందోళన వ్యక్తంచేశారు.ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు(TSRTC MD Sajjanar) ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలియజేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో(Mahalakshmi Scheme) భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. కానీ ఒకరిద్దరు కండక్టర్లు బస్సుల్లో మహిళలకు టిక్కెట్లు జారీ చేస్తున్నారు.
మహాలక్ష్మి పథకం ప్రారంభోత్సవంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య గొడవ
నిజామాబాద్ జిల్లా బోధన్ డిపో పరిధిలోని ఓ కండక్టర్ తనకు టికెట్ జారీ చేసినట్లు ఓ మహిళ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన ఆర్టీసీ ఎండీ సదరు కండక్టర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సంబంధిత కండక్టర్‌కు బాధ్యతలు అప్పగించకుండా డిపో స్పేర్‌లో ఉంచడం జరిగిందని, ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఎండీ సజ్జనార్ వెల్లడించారు.
Huge Crowd at RTC Bus Stand :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఈ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో ఆర్టీసీ ప్రాంగణాలన్నీ అతివలతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో కొన్నిచోట్ల ఘర్షణలు సైతం తలెత్తేలా పరిస్థితి నెలకొంటుంది. మరోవైపు సీటు కోసం సాహసాలే చేస్తున్న ఘటనలు లేకపోలేదు. తాజాగా నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులో అటువంటి ఘటనే చోటుచేసుకుంది. బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు(Passengers) పోటీపడ్డారు.