తెలంగాణ

telangana

ETV Bharat / state

నిబంధనలు పాటించని ప్రైవేటు బస్సులు సీజ్‌ - నిజామాబాద్​ వార్తలు

రవాణా శాఖ నిబంధనలు పాటించకుండా నడుస్తున్న మూడు ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్​ చేశారు. విజిలెన్స్​, డీటీసీ అధికారులు కలిసి చేసిన తనిఖీల్లో ప్రైవేట్​ బస్సులను సీజ్​ చేసినట్లు అధికారులు తెలిపారు.

RTA Officers seized Private buses in nizamabad
నిబంధనలు పాటించని ప్రైవేటు బస్సులు సీజ్‌

By

Published : Jul 26, 2020, 8:33 PM IST

రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మూడు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్‌ చేశారు. నిజామాబాద్‌-ముంబయికి నిత్యం నడుస్తున్న దత్త సాయి, కుమార్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు అధికారులు ఇటీవల గుర్తించారు. విజిలెన్స్‌ విభాగం, నిజామాబాద్‌ డీటీసీ వెంకట రమణ ఆధ్వర్యంలో శనివారం తనిఖీలు జరిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దులు కాకుండా ఇతర ప్రాంతాల మీదుగా ఎలాంటి పన్నులు చెల్లించకుండా నడుస్తున్న మూడు బస్సులను సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details