తెలంగాణ

telangana

ETV Bharat / state

పకడ్బందీ భద్రత నడుమ బోధన్.. రాకపోకలు బంద్​ - పోలీసులు కట్టుదిట్టమైన భద్రత

నిజామాబాద్​ జిల్లా బోధన్​ పట్టణంలో కరోనా పాజిటివ్ ​కేసులు నమోదవ్యడం వల్ల పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. బోధన్​ నుంచి రాకపోకలను బంద్​ చేశారు.

roads are closed around the bhodhan by the police in nizamabad due to corona effect
పకడ్బందీ భద్రత నడుమ బోధన్.. రాకపోకలు బంద్​

By

Published : Apr 9, 2020, 11:32 AM IST

కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో పోలీసులు ఆంక్షలు విధించారు. బోధన్ రెవెన్యూ డివిజన్లో 10 పాజిటివ్ కేసులు నమోదైనందువల్ల బోధన్ పట్టణాన్ని కంటోన్మెంట్​గా గుర్తించి పట్టణంలోకి ఎవరిని రానివ్వకుండా రహదారులు మూసివేశారు.

బోధన్ పట్టణ ప్రవేశమార్గం అయినటువంటి ఆచన్​పల్లి వద్ద బారికేడ్లు పెట్టి రాకపోకలను నియంత్రిస్తున్నారు. పట్టణంలోని శక్కర్ నగర్, రాకాసిపేట్ ఏరియాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు నమోదు అవ్వడం వల్ల పోలీసులు పకడ్బందీగా పహారా కాస్తున్నారు.

ఇదీ చూడండి:తగ్గుతున్న వాయుకాలుష్యం.. తేటపడుతున్న నగరాలు

ABOUT THE AUTHOR

...view details