తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డెక్కిన రైతన్నలు - nizamabad darna

నిజామాబాద్ జిల్లాలో పసుపు, ఎర్రజొన్న రైతుల ఆందోళన కొనసాగుతోంది. భారీ సంఖ్యలో రోడెక్కడం వల్ల  రహదారులపై వాహనాలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో పోలీసులు 144సెక్షన్ విధించారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఇతర ప్రాంతాల మీదుగా మళ్లిస్తున్నారు.

పసుపు, ఎర్రజొన్న రైతుల దర్నా

By

Published : Feb 16, 2019, 2:23 PM IST

పసుపు, ఎర్రజొన్న రైతుల దర్నా
నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్​పల్లి, ధర్పల్లి మండల కేంద్రాల్లో పసుపు, ఎర్రజొన్న రైతులు రోడెక్కారు. మద్దతు ధర కేటాయించాలని 44వ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. పసుపుకు 15వేలు, ఎర్రజొన్నకు 3వేల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో పోలీసులు 144సెక్షన్​ విధించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పోలీసులు ట్రాఫిక్​ క్రమబద్ధీకరిస్తున్నారు. నిజామాబాద్ హైదరాబాద్ వెళ్లే వాహనాలను బైంసా, బాసర, ఖానాపూర్ మీదుగా మళ్లిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details