నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జాతీయ రహదారుల సంస్థ, నిర్మల్ బీవోటీ ఆధ్వర్యంలో రహదారి భద్రత వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. వారోత్సవాల్లో భాగంగా బాల్కొండ శివార్లోని హెచ్‌పీ ఇంధన బంకు వద్ద వాహన చోదకులకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరాన్ని ఆర్మూర్ ఎంవీఐ జయ ప్రకాష్‌రెడ్డి ప్రారంభించారు.
నిజామాబాద్ జిల్లాలో రహదారి భద్రత వారోత్సవాలు - ROAD WAYS SAFETY WEEK CELEBRATIONS IN NIZAMABAD
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్‌లో రహదారి భద్రత వారోత్సవాలను ప్రారంభించారు. రహదారిపై నడుచుకోవాల్సిన తీరు గురించి చోదకులకు ఆర్మూర్ ఎంవీఐ జయప్రకాశ్ రెడ్డి అవగాహన కల్పించారు.
మితిమీరిన వేగం వద్దు... మద్యం మత్తులో నడపవద్దు : ఆర్మూర్ ఎంవీఐ
వాహన చోదకులకు కంటి చూపు మెరుగ్గా ఉండాలని... తరుచుగా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వాహనాన్ని నడిపే సమయంలో రహదారి నియమాలు పాటించాలని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలను నడపవద్దని హెచ్చరించారు. మితిమీరిన వేగంతోనూ వెళ్లవద్దని సూచించారు. కార్యక్రమంలో నిర్మల్ బీవోటీ అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : పురపోరులో తెరాసకు ఇంటిపోరు