రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్ పార్థసారథి - తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్
![రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్ పార్థసారథి partha sarathy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8725791-450-8725791-1599567501189.jpg)
16:35 September 08
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి పార్థసారథి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి పార్థసారథి నియమితులయ్యారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర తొలి ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నాగిరెడ్డి ఇటీవల పదవీవిరమణ చేశారు. అప్పట్నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆ స్థానంలో విశ్రాంత ఐఏఎస్ అధికారిని పార్థసారథిని ప్రభుత్వం నియమించింది.
1988లో ఆర్డీఓగా విధుల్లో చేరిన పార్థసారథికి 1991లో ఐఏఎస్‌గా పదోన్నతి వచ్చింది. అప్పట్నుంచి వివిధ హోదాల్లో పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కరీంనగర్ కలెక్టర్‌గా, మార్కెఫెడ్ ఎండీగా, సమాచార-పౌరసంబంధాల కమిషనర్‌గా పనిచేశారు.
రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధనా సంస్థ (ఈపీటీఆర్‌ఐ) డైరెక్టర్ జనరల్‌గా సేవలందించారు. తెలంగాణ విశ్వవిద్యాలయం, ఉద్యాన వర్శిటీలకు ఇంఛార్జీ ఉపకులపతిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యకార్యదర్శి హోదాలో ఇటీవలే పదవీ విరమణ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఆయన మూడేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.