తెలంగాణ

telangana

ETV Bharat / state

మాంసం విక్రయ కేంద్రాలు, హోటళ్లు, దుకాణాల నిర్వహణపై ఆంక్షలు - నిజామాబాద్​ ఆర్మూర్​ కరోనా కేసులు

కరోనా కట్టడికి గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, ప్రజలు ముందు జాగ్రత్త చర్యలను చేపట్టారు. నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ మండలం ఆలూరు గ్రామంలో మాంసం విక్రయ కేంద్రాలు, హోటళ్లు, దుకాణాల నిర్వహణపై ఆంక్షలు విధించారు. నిర్ణీత సమయాలను సూచించి కేవలం ఆ సమయాల్లోనే వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు.

Villages Shutdown
నిజామాబాద్​ జిల్లాలోని గ్రామాల్లో ఆంక్షలు

By

Published : Jun 16, 2020, 4:19 PM IST

నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ మండలం ఆలూరు గ్రామంలో కరోనా వ్యాప్తి నివారణ కోసం కఠిన చర్యలు చేపట్టారు. సర్పంచ్ కళ్లెం మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, గ్రామాభివృద్ధి కమిటీ ప్రతినిధులు, రాజకీయ నాయకులు సమావేశమై కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. గ్రామంలోని మాంసం విక్రయ కేంద్రాలు, హోటళ్లు, దుకాణాల నిర్వహణపై ఆంక్షలు విధించారు.

ఉదయం 5 గంటల నుంచి 10 గంటల దాకా... సాయంత్రం ఐదు గంటల నుంచి 7 గంటల దాకా వ్యాపార సముదాయాలను తెరిచి ఉంచాలన్నారు. గ్రామస్థులు భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించకుండా బయటకు వస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఆర్మూర్​ మండలంలోని మగ్గిడి గ్రామంలో ఓ యువకుడికి కరోనా పాజిటివ్ రావడం వల్ల ఇతర గ్రామాల్లో ప్రజలు అప్రమత్తమయ్యారు.

ఇవీ చూడండి: మద్యం రవాణా... సరిహద్దులో ఉరుకులు పరుగులు

ABOUT THE AUTHOR

...view details