నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ధర్మోరా గ్రామానికి చెందిన హనుమాండ్లు ఐదేళ్ల క్రితం సౌదీ వెళ్లాడు. అక్కడ జరిగిన ఓ కారు ప్రమాదంలో అతని మూత్రపిండం, వెన్నుపూస పూర్తిగా దెబ్బతిని.. రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి.
ఈటీవీ భారత్ కథనానికి స్పందన... ఆ కుటుంబానికి ఆపన్నహస్తం - నిజామాబాద్ జిల్లా తాజా వార్తలు
సాఫీగా సాగుతున్న కుటుంబాన్ని చుట్టుముట్టిన కష్టాల పేరిట ఈనెల 21న ప్రచురితమైన ఈనాడు-ఈటీవీ భారత్ కథనానికి స్పందన లభించింది. ఓ సేవా సమితి సభ్యులు బాధితుడు హనుమాండ్లు కుటుంబానికి అండగా నిలిచారు.
కథనానికి స్పందన: బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
ఈనాడు-ఈటీవీ భారత్ ఆగష్టు 21న హనుమాండ్లుపై కథనం ప్రచురించింది. సాఫీగా సాగుతున్న కుటుంబాన్ని చుట్టుముట్టిన కష్టాలు పేరిట ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. హనుమాండ్లు కుటుంబ సభ్యులకు శ్రీ లక్ష్మీ సేవా సమితి సభ్యులు తమ వంతు సాయంగా రూ.10 వేలు, రెండు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించారు.
ఇదీచూడండి.. 'సాఫీగా సాగుతున్న కుటుంబాన్ని చుట్టుముట్టిన కష్టాలు'