'గల్ఫ్ గాయం- కుటుంబానికి శాపం' పేరుతో ఈటీవీ భారత్‌లో ప్రచురితమైన కథనానికి గల్ఫ్ బాధిత సంక్షేమ సంఘం స్పందించింది. నిజామాబాద్ జిల్లా న్యావనందికి చెందిన మగ్గిడి శ్రీనివాస్.. బహ్రెయిన్‌లో ఉపాధి కోసం వెళ్లి... అనుకోని ప్రమాదంతో కాలు, చేయి పనిచేయక మంచానికే పరిమితమయ్యాడు.
ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. బాధితుడికి అండగా నిలిచిన దాతలు - Response to an article aired by ETV Bharat on a nizamabad Gulf victim
ఈటీవీ భారత్‌లో ప్రసారమైన గల్ఫ్ బాధితుడి వ్యథను చూసి పలువురు స్పందించారు. 'గల్ఫ్ గాయం- కుటుంబానికి శాపం!' పేరుతో ప్రచురితమైన కథనంపై స్పందించిన బసంత్ రెడ్డి స్పందించి ముందుకొచ్చి వైద్యం కోసం నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
'గల్ఫ్ గాయం- కుటుంబానికి శాపం' కథనానికి స్పందన
గత 20రోజుల కింద ఎట్టకేలకు భారత్‌కు కంపెనీ ప్రతినిధులు శ్రీనివాస్‌ను పంపించారు. పూర్తిగా కోలుకుని మామూలు మనిషి కావాలంటే రూ.15లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో అంత స్థోమత లేక కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లి సపర్యలు చేస్తున్నారు. శ్రీనివాస్ దయనీయ గాథపై ఈటీవీ భారత్ కథనం ప్రచురితం చేయగా బసంత్ రెడ్డి స్పందించి ముందుకొచ్చి వైద్యం కోసం నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.