telangana university Nizamabad: తెవివి రిజిస్ట్రార్ కనకయ్య తొలగింపు - తెలంగాణ వార్తలు
09:39 October 31
తెవివి రిజిస్ట్రార్ కనకయ్య తొలగింపు
తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కనకయ్యను తొలగిస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఆయన నియామకం నిబంధనల మేరకు లేకపోవడంతో తొలగించినట్లు తెలిపింది. ఆయన స్థానంలో కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం డీన్ ఆచార్య ఎం.యాదగిరిని నియమించింది. యాదగిరి గతంలో తెలంగాణ, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్‌గా పనిచేశారు.
కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ అధ్యక్షతన శనివారం రోజున నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో జరిగిన తెవివి పాలకమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల చేపట్టిన పరిపాలన పదవులు, పదోన్నతులు కూడా రద్దవుతాయని ప్రకటించారు. సమావేశంలో వర్సిటీ ఉపకులపతి ఆచార్య రవీందర్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Huzurabad by election news: ప్రైవేటు వాహనంలో వీవీప్యాట్ తరలింపు.. భాజపా, కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన