తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫ్లెక్సీల కల్చర్​ను తగ్గించాలి : మంత్రి కేటీఆర్​ - బాన్సువాడలో జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

ఈమధ్య ఫ్లెక్సీ కల్చర్ ఎక్కువైందని, ప్లాస్టిక్​తో పాటు ఫ్లెక్సీల కల్చర్​ను నివారిద్దామని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

Reduce Flexibility Culture: KTR in telangana
ఫ్లెక్సీల కల్చర్​ను తగ్గించాలి : కేటీఆర్​

By

Published : Nov 30, 2019, 11:11 PM IST

ఫ్లెక్సీల కల్చర్ నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, బాన్సువాడలో ఫ్లెక్సీలు బంద్​ చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా బాన్సువాడలో జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. బాన్సువాడను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డి లక్ష్మీ పుత్రుడుగా ఉంటూ రాష్ట్రంలో నూతన మార్పులు తెస్తున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 43 ఏళ్ల సుదీర్ఘ రాజకీయంలో నిత్య విద్యార్థిగా అందరికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో సభాపతి శ్రీనివాస్​ రెడ్డి, మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

ఫ్లెక్సీల కల్చర్​ను తగ్గించాలి : మంత్రి కేటీఆర్​

ఇదీ చూడండి : 'శంషాబాద్‌' నిందితులకు 14 రోజుల రిమాండ్‌

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details