తెలంగాణ

telangana

ETV Bharat / state

రెడ్ క్రాస్​ సొసైటీ నూతన అంబులెన్స్ ప్రారంభించిన కలెక్టర్ - ambulance started by nizamabad collector

కరోనా కాలంలో మారుమూల గ్రామాల్లో ప్రజలను ఆదుకునేందుకు నిజామాబాద్ రెడ్​ క్రాస్​ సొసైటీ నూతనంగా అంబులెన్స్​ను కొనుగోలు చేసింది. వాహనాన్ని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ప్రారంభించారు.

red cross society ambulance inaugurated in nizamabad
రెడ్ క్రాస్​ సొసైటీ నూతన అంబులెన్స్ ప్రారంభించిన కలెక్టర్

By

Published : Jul 22, 2020, 4:17 PM IST

నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ నూతనంగా కొనుగోలు చేసిన అంబులెన్స్​ను జిల్లా పాలనాధికారి సి. నారాయణరెడ్డి ప్రారంభించారు. జిల్లాలో మారుమూల గ్రామాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించి కరోనా కాలంలో జిల్లాలో అధిక శాతం రక్త నిల్వలు ఉండే విధంగా చొరవ చూపుతామని రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ నీలి రామచందర్ వెల్లడించారు.

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు ఉన్న పెద్ద అంబులెన్స్ కొనుగోలు చేయాలనే ఆకాంక్ష తీరిందని రాంచందర్ పేర్కొన్నారు. కొవిడ్-19 నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రక్తనిల్వలు తగ్గిపోయాయని.. కాబట్టి యువతీయువకులు మందుకు వచ్చి రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై సీఎం కేసీఆర్ సమీక్ష

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details