ఎమ్మెల్సీ కవిత ఆదేశాలతో హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అర్చకులు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా సారంగపూర్ ఆంజనేయస్వామి మందిరంలో పూజలు చేశారు.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా సారంగాపూర్ హనుమాన్ మందిరంలో చాలీసాను పఠించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆధ్యాత్మిక గురువులు, అర్చకులు, అంజన్న సేవా సమితి సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక గురువులు, అర్చకులు, అంజన్న సేవా సమితి సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకాగా.. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తులు వేదికపై హనుమాన్ చాలీసాను పఠించారు. రెండు మండలాల పాటు (80 రోజుల) ఈ హనుమాన్ చాలీసా అఖండ పారాయణం కొనసాగుతుందని అర్చకులు తెలిపారు. భక్తులు ప్రతిరోజు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని జిల్లా జాగృతి అధ్యక్షుడు అవంతి రావు కోరారు. ప్రతి ఇంటా హనుమాన్ చాలీసా పఠించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.