తెలంగాణ

telangana

ETV Bharat / state

'న్యాయస్థానాలు చెప్తున్నా.. అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు'

ధరణి పోర్టల్​లో ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ​ నేటినుంచి ప్రారంభమైంది. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిజామాబాద్​ నగర రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సభ్యులు ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో ఒక్క స్లాట్ కూడా​ నమోదు కాలేదు.

real estate builders protest against on Dharani portal at registration office at nizamabad district
'న్యాయస్థానాలు చెప్తున్నా... అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు'

By

Published : Dec 14, 2020, 3:52 PM IST

నిజామాబాద్​ జిల్లాలో నగర రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సభ్యులు... రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. న్యాయస్థానాలు పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్​లు చేయాలని చెప్తున్నా... అధికారులు మాత్రం నూతన పద్ధతి ద్వారా రిజిస్ట్రేషన్​లు చేయడం సరైన పద్ధతి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్థిక భారం పడుతోంది..

ఎల్​ఆర్ఎస్​, ధరణి పోర్టల్​ను వెంటనే రద్దు చేసి... ఆగిన రిజిస్ట్రేషన్లను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిను ఈ విధానం వల్ల ఫ్లాట్ కొనే వారిపై, ఇల్లు కట్టుకునే వారిపై ఆర్థిక భారం అధికంగా పడుతుందని ఆరోపించారు.

ఒక్క స్లాట్ కూడా​ బుక్​ కాలేదు..

జిల్లాలో ఒక్క స్లాట్‌ కూడా బుకింగ్‌ కాలేదని నిజామాబాద్ జిల్లా రిజిస్ట్రార్ రవీంద్ర రావు పేర్కొన్నారు. అమావాస్య నేపథ్యంలో ప్రజలు రాలేదని... రేపటి నుంచి స్లాట్ బుక్ అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.

ఇదీ చూడండి:వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details