నిజామాబాద్ ఆర్డీఓగా నూతనంగా నియమితులైన రవి బాధ్యతలు చేపట్టారు. మెదక్ జిల్లా జెడ్పీ సీఈఓగా విధులు నిర్వహించిన ఆయనకు, ఆర్డీఓగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకు ఉన్న ఆర్డీఓ వెంకటయ్య, గత నెలలో పదవి విరమణ పొందారు.
నిజామాబాద్ ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన రవి - నిజామాబాద్ ఆర్డీఓ
నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ అధికారిగా నూతనంగా నియమితులైన రవి... పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఉద్యోగులు కొత్త అధికారికి పుష్ప గుచ్ఛంతో స్వాగతించారు.
నిజామాబాద్ ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన రవి
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రవిని నిజామాబాద్ ఆర్డీఓగా బదిలీ చేసింది. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ ఉద్యోగులు పుష్పగుచ్ఛం అందజేసి ఆయనకు స్వాగతం పలికారు.
ఇవీ చూడండి : 'కరోనా వస్తే పెద్దోళ్లకు చేసే వైద్యమే పేదోళ్లకూ అందించాలి'