తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజాం షుగర్​ ఫ్యాక్టరీని వెంటనే తెరవాలి - 44 నెలల బకాయిలు

బోధన్  నిజాం  షుగర్  ఫ్యాక్టరీని వెంటనే తెరపించాలని భాజపా నాయకులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.   నేషనల్  లా  ట్రిబ్యునల్  లిక్విడెషన్ ఉత్తర్వులను ఆపాలని డిమాండ్​ చేశారు.

నిజాం షుగర్​ ఫ్యాక్టరీని వెంటనే తెరవాలి

By

Published : Jun 18, 2019, 5:32 PM IST

నిజాం షుగర్​ ఫ్యాక్టరీని వెంటనే తెరవాలి
నిజామాబాద్ జిల్లా బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ వెంటనే తెరిపించాలని కార్మికులు, భాజపా నేతలు ఆందోళనకు దిగారు. నాగన్​పల్లి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని అక్రమంగా లే ఆఫ్ ప్రకటించి కార్మికులకు రావాల్సిన 44 నెలల బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. 2014 ఎన్నికల్లో తెరాస అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చి.. కేసీఆర్​ మాట మార్చారని భాజపా నాయకులు మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఉపాధి కల్పించిన సంస్థను అమ్మకానికి పెట్టడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details