Ramoji foundation: రామోజీ ఫౌండేషన్ అందించే ప్రతి ఒక్క రూపాయి పిల్లల బంగారు భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు రామోజీ ఫౌండేషన్, ఈనాడు యాజమాన్యానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థులకు ఈనాడు అందిస్తున్న సహాయం చాలా గొప్పదన్నారు. మానవతా సదన్‌కు సాయం చేయడం చాలా ఆనందదాయకంగా ఉందని తెలిపారు.
2 లక్షల విలువైన విద్యాసామగ్రి అందజేత
Ramoji foundation Help: నిజామాబాద్ డిచ్పల్లి మండల కేంద్రంలోని మానవతా సదన్‌లో చదువుతున్న 106 మంది విద్యార్థులకు రూ.2 లక్షల విలువైన విద్యా, వంట సామగ్రిని రామోజీ ఫౌండేషన్ తరఫున అందజేశారు. కలెక్టర్ నారాయణ రెడ్డి చేతులమీదుగా వాటిని పంపిణీ చేశారు. రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సాయం అందిస్తున్నందుకు కలెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈనాడు యాజమాన్యం అనేక రకాలుగా వివిధ రంగాల్లో సేవలను అందిస్తోందని నారాయణరెడ్డి కొనియాడారు. వారు అందిస్తున్న సామాజిక సేవల గురించి మనం అనేక సందర్భాల్లో చూస్తున్నామని తెలిపారు.