తెలంగాణ

telangana

ETV Bharat / state

భార్యతో గొడవపడ్డాడు.. ఆత్మహత్య చేసుకున్నాడు

మద్యానికి, పేకాటకు బానిసయ్యాడు. తరచూ భార్యతో గొడవలు పడేవాడు. నిన్న గొడవ ఎక్కువయ్యేసరికి తట్టుకోలేక క్షణికావేశంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

భార్యతో గొడవపడ్డాడు.. ఆత్మహత్య చేసుకున్నాడు

By

Published : Nov 20, 2019, 12:26 PM IST

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగళ్ పహాడ్ గ్రామానికి చెందిన బట్టు రాజేందర్ కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం రాత్రి రాజేందర్ భార్యతో గొడవ పడ్డాడు. కోపంలో నిన్ను చంపేస్తానంటూ భార్యపై అరిచాడు. భయపడిన భార్య ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయింది. రాజేందర్ తలుపు వేసుకొని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

కాసేపయ్యాక భార్య ఇంట్లోకి వచ్చి చూసేసరికి భర్త చనిపోయి ఉన్నాడు. వెంటనే స్థానికులను పిలిచి పోలీసులకు సమాచారమందించింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకు దించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. మద్యానికి, పేకాటకు బానిసైన అతను తరచూ ఇంట్లో గొడవ పడేవాడని స్థానికులు తెలిపారు.

భార్యతో గొడవపడ్డాడు.. ఆత్మహత్య చేసుకున్నాడు

ఇవీ చూడండి: ఆర్టీసీ ఐకాస నేతల అత్యవసర భేటీ...

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details