తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈసీ నిర్ణయం ప్రకారమే ఇందూరు ఎన్నికలు - nizamabad elections

తమ నిరసనను జాతీయ స్థాయికి తీసుకువెళ్లడానికి పసుపు, ఎర్రజొన్న రైతులు నిజామాబాద్ లోక్​సభకు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం 185 మంది బరిలో ఉన్నారు. అయితే ఎన్నికలు ఈవీఎంలతో నిర్వహిస్తారా? బ్యాలెట్​తోనా? అనే సందిగ్ధత ఇంకా వీడలేదు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయానికి అనుగుణంగా పోలింగ్ నిర్వహిస్తామని రజత్ కుమార్ వెల్లడించారు.

ఈసీ నిర్ణయానికి అనుగుణంగా పోలింగ్

By

Published : Mar 31, 2019, 12:17 AM IST

Updated : Mar 31, 2019, 7:29 AM IST

ఈసీ నిర్ణయానికి అనుగుణంగా పోలింగ్
నిజామాబాద్ పోలింగ్​పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈసీని కోరినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. ఏ క్షణమైనా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం వెలువరించే అవకాశం ఉందని అన్నారు. ఈవీఎం, బ్యాలెట్ రెండు విధానాల్లోనూ పోలింగ్ అవసరాలను ఈసీకి నివేదించామని చెప్పారు.

ఈవీఎంల ద్వారా నిర్వహిస్తే మరో 26వేల బెల్ ఎం-3 యంత్రాలు అవసరమవుతాయాని సీఈఓ పేర్కొన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఒక కంట్రోల్ యూనిట్​కు 12 బ్యాలెట్ యూనిట్లు అనుసంధానించాల్సి ఉంటుందని వెల్లడించారు. బ్యాలెట్ విధానంలో నిర్వహించాల్సి వస్తే బ్యాలెట్ నమూనా, బ్యాలెట్ బాక్స్ పరిమాణం తదితరాలను కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయానికి అనుగుణంగా పోలింగ్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్న ఆయన... బ్యాలెట్ ద్వారా నిర్వహించాల్సి వస్తే సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఈసీ నిర్ణయం వచ్చేవరకు నిజామాబాద్​లో శిక్షణ నిలిపివేశామని... కమిషన్ నిర్ణయానికి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇవీ చూడండి:రాష్ట్రం నీటితో కళకళలాడాలి: సీఎం కేసీఆర్

Last Updated : Mar 31, 2019, 7:29 AM IST

ABOUT THE AUTHOR

...view details