యాసంగి రైతుబంధు నిధులను త్వరలోనే విడుదల చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో మంత్రి ప్రశాంత్ రెడ్డి.. తన తండ్రి సురేందర్ రెడ్డి జ్ఞాపకార్థం నిర్మించిన రైతు వేదికను మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపడుతున్నామన్నారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా రైతు బంధు అమలుచేస్తున్నామని తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా రైతులు పంటలు వేయాలని సూచించారు. ఏటా మొక్కజొన్న కొనుగోలు చేయడం ప్రభుత్వానికి సాధ్యం కాదని తేల్చిచెప్పారు.
సన్నరకం ధాన్యంపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. రైతులకు బోనస్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డు తగులుతోందని ఆరోపించారు. కేంద్రం.. రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని విమర్శించారు. కార్పొరేట్లకు మేలు చేసే విధంగా వ్యవసాయ చట్టం తెచ్చిందన్నారు.