మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. డిచ్పల్లి, నవీపేట్, నిజామాబాద్ పట్టణ ప్రాంతాల్లో అకస్మాత్తుగా చిరు జల్లులు కురిశాయి.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షం - నిజామాబాద్ జిల్లాలో వర్ష సమాచారం
ఉపరితల ఆవర్తన ప్రభావంతో నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసింది.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షం
ఉత్తర, మధ్య మహారాష్ట్ర.. దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 0.9 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతూ ఉంది. దాని ప్రభావంతో ఉత్తర తెలంగాణలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసింది.