Rahul Gandhi Election Campaign at Bodhan : రాష్ట్రంలో ల్యాండ్, సాండ్, వైన్స్ మాఫియా పెరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ల్యాండ్, సాండ్, వైన్స్‌పై వచ్చే డబ్బంతా కేసీఆర్ ఇంటికే చేరిందని ఆరోపించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ఎస్సీల కోసం ఖర్చు చేయలేదని.. తెలంగాణలో ప్రజల పాలన అనేది కనిపించటం లేదని మండిపడ్డారు. కుటుంబ, అవినీతి పాలన వల్ల తెలంగాణ నష్టపోయిందన్న రాహుల్ గాంధీ.. దొరల పాలనను అంతం చేసి ప్రజల పాలన తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ గెలిస్తే.. ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టో - ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ మాస్టర్ ప్లాన్
"రాష్ట్రంలో ల్యాండ్, సాండ్, వైన్స్ మాఫియా పెరిగింది. వాటి ద్వారా వచ్చే డబ్బంతా కేసీఆర్ ఇంటికే చేరింది. తెలంగాణలో ప్రజల పాలన కనిపించటం లేదు. దొరల పాలనను అంతం చేసి ప్రజల పాలన తెచ్చుకోవాలి. కాంగ్రెస్ గెలిస్తే.. ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం." - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
Mallikarjuna Kharge Fires on CM KCR : హైదరాబాద్‌లో నెహ్రూ కాలంలోనే అనేక పరిశ్రమలు వచ్చాయని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. బీహెచ్‌ఈఎల్ వంటి అనేక పరిశ్రమలు కాంగ్రెస్ హయాంలో వచ్చాయని తెలిపారు. హస్తం పార్టీ పెట్టిన పరిశ్రమలను మోదీ సర్కారు అమ్ముకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగంలో కాంగ్రెస్ గతంలో ఎన్నో ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్ సర్కారు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంచిందని విమర్శించారు. కేసీఆర్, మోదీ.. పేదలను మరింత పేదలుగా చేస్తున్నారని మండిపడ్డారు. సికింద్రాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ ప్రచార సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.