భారత మాజీ ప్రధాని, పీవీ నరసింహా రావు శత జయంతి వేడుకలను నిజామాబాద్ కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో ఘనంగా నిర్వహించారు. పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీవీ నరసింహా రావు సేవలను ఈ దేశం ఎప్పటికీ గుర్తించుకుంటుందని ఎమ్మెల్సీ ఆకుల లలిత తెలిపారు.
'ప్రపంచ దేశాలతో భారత్ పోటీ.. పీవీ ఆర్థిక సంస్కరణల పుణ్యమే'
భారత్ ప్రపంచదేశాలతో పోటీ పడుతోందంటే పీవీ నరసింహా రావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వల్లేనని ఎమ్మెల్సీ ఆకుల లలిత అన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో పీవీ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
'ప్రపంచదేశాలతో పోటీ.. ఆయన ఆర్థిక సంస్కరణల పుణ్యమే'
భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందంటే అది ఆయన తీసుకొచ్చిన ఆర్ధిక సంస్కరణల పుణ్యమే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ, నగర మేయర్ నీతూ కిరణ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషన్ జితేష్.వి. పాటిల్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: పీవీకి అభిమానులెక్కువ.. ఘనంగా నిర్వహించండి: కేసీఆర్