తెలంగాణ

telangana

ETV Bharat / state

పదవీ విరమణ ఓ ముఖ్య ఘట్టం : పుల్లెల గోపీచంద్ - పదవీ విరమణ వయస్సు

నిజామాబాద్ జిల్లాలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహిత నర్రా రామారావు పదవీ విరమణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ హాజరయ్యారు.

pullela gopichand attended national Best Teacher Award receivers Retirement Ceremony
పదవీ విరమణ ఓ ముఖ్య ఘట్టం : పుల్లెల గోపీచంద్

By

Published : Jan 11, 2021, 1:14 PM IST

ప్రతి ఉపాధ్యాయుడు నిజాయితీగా పని చేసినప్పుడే విద్యార్థుల జీవితాలు మెరుగుపడతాయని ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బొర్గం జిల్లాపరిషత్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహిత నర్రా రామారావు పదవీ విరమణ మహోత్సావానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ అభివృద్ధి కమిటీ, పూర్వ విద్యార్థుల చేతులమీదుగా ఆయనను ఘనంగా సన్మానించారు.

ఉత్తమ ఉపాధ్యాయుడిగా రామారావు చేసిన సేవలు మరువలేనివన్నారు గోపిచంద్. పేద విద్యార్థుల చదువు కోసం ఆర్థికంగా కూడా ఎంతో సాయపడ్డారని గుర్తు చేశారు. పదవీ విరమణ అనేది ప్రభుత్వ ఉద్యోగుల జీవితంలో ఓ ముఖ్య ఘట్టమని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:పదవీ విరమణ పొందినోళ్లు ప్రజలను చైతన్యపరచాలి: బీఎస్​ రాములు

ABOUT THE AUTHOR

...view details