సన్న బియ్యానికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నిజమాబాద్ జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎడపల్లి మండలం జానకంపేట వద్ద భాజపా ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే సన్నరకం ధాన్యానికి మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు.
సన్నాలకు మద్దతుధర కల్పించాలని భాజపా రాస్తారోకో - సన్న రకం బియ్యానికి మద్దతు ధర కోసం ధర్న
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట వద్ద భాజపా ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. సన్నరకం ధాన్యానికి సరైన మద్దతుధరను కల్పించి రైతులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

సన్నాలకు మద్దతుధర కల్పించాలని భాజపా రాస్తారోకో
నిర్బంధంగా రైతులతో సన్నాలు సాగు చేయించిన సీఎం కేసీఆర్.. సరైన మద్దతు ధర ఇవ్వకపోవడం శోచనీయమని భాజపా జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య ఆరోపించారు. వెంటనే సన్నాలకు రూ. 2,500 ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ ప్రకటనకు ముందే మక్కలు అమ్ముకున్న రైతులకు రూ. 500 బోనస్ ప్రకటించాలన్నారు.
ఇదీ చదవండి:ఆ పరిస్థితిని కేసీఆర్ ప్రభుత్వం కొనితెచ్చుకోవద్దు: బండి సంజయ్