తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రైవేటు టీచర్లకు తక్షణమే భృతి అందించాలి' - తెలంగాణ వార్తలు

అర్హులందరికీ ఆర్థిక సాయం ప్రకటించాలని ఆర్మూర్ డివిజన్ ప్రైవేటు టీచర్లు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. రూ.2000 ఆర్థికసాయం, 25 కేజీల బియ్యం అందజేయాలని కోరారు.

Private teachers protest, private teachers demand for help
ఆర్థిక సాయం అందజేయాలని ధర్నా, ప్రైవేటు టీచర్ల ధర్నా

By

Published : May 5, 2021, 1:08 PM IST

ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం అందని ప్రైవేటు టీచర్లకు తక్షణమే భృతి అందించాలని ఆర్మూర్ డివిజన్ ప్రైవేటు టీచర్లు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

కొందరు టీచర్లకు రూ.2000, 25 కిలోల బియ్యం అందడం లేదని అసోసియేషన్ అధ్యక్షుడు పి.డి నాయుడు తెలిపారు. లబ్ధిదారులందరికీ అందేలా చొరవ చూపాలని డీఈవో దుర్గా ప్రసాద్​కు వినతి పత్రాన్ని అందజేశారు.

ఇదీ చదవండి:కొవిడ్‌ దెబ్బకి గిరాకీలు లేక అల్లాడుతున్న వ్యాపారాలు

ABOUT THE AUTHOR

...view details