తెలంగాణ

telangana

'ఎయిడెడ్ స్కూళ్లలోని ప్రైవేటు టీచర్లకు భృతి ఇవ్వాలి'

By

Published : May 4, 2021, 9:31 AM IST

ఎయిడెడ్ స్కూళ్లలోని ప్రైవేటు టీచర్లకు భృతి ఇవ్వాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జీతాలు లేక ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వాపోయారు. నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని డీఈవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.

private
ఎయిడెడ్ ప్రైవేటు టీచర్ల ధర్నా, భృతి కోసం ప్రైవేటు టీచర్ల ధర్నా

ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు ప్రభుత్వం ప్రకటించిన రూ.2000 భృతి, 25 కిలోల బియ్యం తమకు ఇవ్వాలని ఎయిడెడ్ పాఠశాలలో పనిచేసే ప్రైవేటు టీచర్లు డిమాండ్ చేశారు. సీఐటీయూ మద్దతుతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీతాలు లేక ప్రైవేటు టీచర్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మల్యాల గోవర్ధన్ అన్నారు. కొంతమంది ఆత్మహత్యలకు ఒడిగట్టారని వాపోయారు.

ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ధ్రువీకరణ పత్రం ఇవ్వకపోవడం వల్ల విద్యాశాఖలో వివరాలు పొందుపరచలేదని తెలిపారు. ఫలితంగా అర్హులైన వారికి సాయం అందడం లేదని అన్నారు.

ఇదీ చదవండి:దేవరయాంజాల్‌ భూములను పరిశీలించిన ఐఏఎస్‌ల కమిటీ

ABOUT THE AUTHOR

...view details