విద్యుదాఘాతంతో ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట్లో చోటుచేసుకుంది. సుభాష్‌నగర్‌కు చెందిన రజాక్(35)... ఓ వెల్డింగ్ దుకాణంలో విద్యుత్ రావడం లేదని చెప్పడంతో స్తంభం ఎక్కాడు. మరమ్మతు చేస్తుండగా పైనున్న 11కేవీ వైర్లు అతనికి తగిలాయి.
విద్యుదాఘాతంతో ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ మృతి - nizamabad district latest news
నిజామాబాద్ జిల్లా నవీపేట్లో విషాదం చోటుచేసుకుంది. మరమ్మతులు చేస్తుండగా... ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ మృతి చెందాడు.
![విద్యుదాఘాతంతో ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ మృతి Private electrician died by electric shock in nizamabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10245521-986-10245521-1610656383780.jpg)
విద్యుదాఘాతంతో ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ మృతి
వెంటనే మంటలు చెలరేగి అతనికి అంటుకోవడంతో... సగం వరకు కాలిపోయి విద్యుత్ వైర్లకు వేలాడుతూ కనిపించాడు. వాటి నుంచి వేరు చేయగానే అప్పటికే తీవ్ర గాయాలపాలైన రజాక్ కింద పడిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు స్ధానికులు తెలిపారు. మృతుడికి 4నెలల కిందటే వివాహం అయింది.
ఇదీ చదవండి: భక్తిపారవశ్యం... రామేశ్వరాలయంలో భక్తుల కోలాహలం